BTS స్టార్ V 2024లో ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా ఎంపికయ్యాడు. బ్రిటిష్ మ్యాగజైన్ 'నుబియా' ప్రకారం..V ది మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ గా నిలిచాడు. 163 దేశాల నుంచి 70 లక్షలకు పైగా ఓట్లను అందుకుని ఈ టైటిల్ అందుకున్నాడు వి.
ఈ పోటీలో బ్రిటీష్ నటుడు రెగీ-జీన్ పేజ్, పాప్ స్టార్ జస్టిన్ బీబర్, బ్రిటిష్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్ కూడా ఉండగా.. వీరందరి కంటే అత్యధిక ఓట్లు రాబట్టాడు వి. అంతేకాదు.. ఈ పోటీలో Vకి సపోర్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా ఉన్నాయి.
ఈ జాబితాలో చైనా నటుడు, గాయకుడు జియావో జాన్ రెండో స్థానంలో నిలిచారు. జియావో దాదాపు 70 లక్షల ఓట్లను గెలుచుకున్నారు. చైనా నటుడు, గాయకుడు జాంగ్ జెహాన్ (జాంగ్ జెహాన్) లక్షన్నర ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
2020, 2021, 2023 సంవత్సరాల్లో నుబియా నిర్వహించిన ఈ పోటీలో BTS స్టార్ V ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా ఎంపికయ్యాడు. అయితే, 2022లో చైనీస్ నటుడు, గాయకుడు జియావో ఝాన్ టైటిల్ గెలుచుకున్నాడు. కానీ ఈసారి బీటీఎస్ స్టార్ వి ఈ టైటిల్ అందుకున్నాడు.
వి.. కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ BTS టీంలో V (కిమ్ తైహ్యూంగ్) ప్రస్తుతం సైనిక సేవలో ఉన్నారు. తన ఆర్మీ సేవను పూర్తి చేసి అభిమానలు ముందుకు వచ్చే ఏడాది రానున్నాడు. V చివరిగా విడుదలైన ఆల్బమ్ 'లేఓవర్'. ఈ ఆల్బమ్‌కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది.