
Jr NTR: ఎన్టీఆర్‌ని కలిశారు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. తారక్‌తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తారక్‌ని కలవడం ఆనందంగా ఉందని, అతను పనిచేసే విధానం తనకు ఇష్టమని అన్నారు. భావి తరాలకు అనుపమ్ ఖేర్ స్ఫూర్తిని పంచుతూనే ఉండాలని స్పందించారు ఎన్టీఆర్.

Ramayana: రామాయణంపై వస్తున్న రూమర్ల గురించి తాను వింటూ ఉన్నానని అన్నారు నటి లారా దత్తా. ఆ సినిమాలో శూర్పణఖ, మండోదరి, కైకేయి.. తరహా పాత్రలు ఏవి ఇచ్చినా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి సినిమాలో భాగం కావాలని చాలా మందికి ఉంటుందని అన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న రామాయణంలో రావణుడిగా యష్ కనిపిస్తారు.

Turbo: మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న సినిమ టర్బో. ఈ సినిమాను అనుకున్నదానికన్నా ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. జూన్ 13న విడుదల కావాల్సిన సినిమాను మే 23కి ప్రీ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. థ్రిల్‌ని పంచడానికి సిద్ధంగా ఉందీ చిత్రం అని అన్నారు.

Aurom: అజయ్ దేవ్‌గణ్, టబు జంటగా నటించిన సినిమా ఔరోం మే కహా ధమ్ థా. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు మేకర్స్.

Vijay devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం విజయ్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. ప్రస్తుతం సీమ యాస నేర్చుకుంటున్నారట. విజయ్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది.