
అవును.. నిజంగానే బాలీవుడ్ సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత.. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్ళ తర్వాత సౌత్ కంటే బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది నార్త్ ఇండస్ట్రీ. 2023లో టాప్ 3 మూవీస్ అక్కడ్నుంచే వచ్చాయి. కొన్నేళ్లుగా సౌత్ దెబ్బకు నార్త్ నరాలు కట్ అయిపోయాయి. కానీ ఈ ఏడాది పఠాన్, గదర్ 2, జవాన్ లాంటి సినిమాలు మళ్లీ వాళ్లను ట్రాక్ ఎక్కించాయి.

2023 మొదట్లో పఠాన్ ఏకంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, కేరళ స్టోరీ, తూ ఝూటీ మై మక్కర్, ఓ మై గాడ్ 2 లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన గదర్ 2 ఏకంగా కేవలం హిందీలోనే 520 కోట్లు వసూలు చేసింది.. జవాన్ అయితే మరోసారి 1000 కోట్ల వైపు పరుగులు తీస్తుంది.

అక్టోబర్ 6న అక్షయ్ కుమార్ మిషన్ రాణిగంజ్.. నవంబర్ 10న సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలు రానున్నాయి. వీటిపై బాలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. ఇవి కానీ హిట్ అయ్యాయంటే నార్త్ కష్టాలు తీరిపోయినట్లే.

ఎందుకంటే 2024లో షారుక్ ఖాన్ డంకీ, హృతిక్ రోషన్ ఫైటర్ లాంటి భారీ సినిమాలు క్యూలో ఉన్నాయి. మొత్తానికి చూడాలిక.. ఈ మంచి రోజులు ఇంకెన్ని రోజులు ఉండబోతున్నాయో...?