
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగా పెళ్లిపీటలెక్కారు. తన ప్రియుడు సన్నీ కపూర్‌తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. సిక్కు సాంప్రదాయం ప్రకారం గురుద్వారలో సోమవారం వీరి వివాహం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా గునీత్ మోంగా స్కై బ్లూ, పింక్ కలర్ లెహెంగా ధరించగా, సన్నీ తెల్లటి షేర్వానీ, స్కై బ్లూ కలర్ టర్బన్‌లో కనిపించాడు.

పెళ్లి వేడుకకు ముందు నిర్వహించిన పార్టీలో విద్యాబాలన్, సోనాలీ బింద్రే, పాత్రలేఖ, నీనా గుప్తా, రియా చక్రవర్తి సహా తదితరులు హాజరై సందడి చేశారు.

గునీత్ మోంగాకు షాహిద్, మసాన్, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఇక సన్నీకపూర్ ఒక ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్

వీరిద్దరూ డేటింగ్ యాప్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆతర్వాత అభిరుచులు, మనసులు కలిశాయి. దీంతో ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.