
యంగ్ జనరేషన్‌లో బాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ప్రూవ్ చేసుకున్న స్టార్ రణబీర్ కపూర్. వరుస బ్లాక్ బస్టర్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న చాక్లెట్ భాయ్.. ఇప్పట్లో కొత్త క్యారెక్టర్ ట్రై చేసే ఛాన్స్ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ రణబీర్ కిట్టీలో ఉన్న సీక్వెల్స్ ఏంటి?

యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రణబీర్ కపూర్, వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో తన ఫస్ట్ మూవీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాతో పాటు మూడు నాలుగు ప్రాజెక్ట్స్ రణబీర్ లిస్ట్‌లో ఉన్నాయి. యానిమల్ సినిమాకు సీక్వెల్‌గా యానిమల్ పార్క్ లైన్‌లో ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉంది యూనిట్.

నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం ట్రయాలజీ కూడా లైన్‌లో ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఒకేసారి మూడు సినిమాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ బ్రహ్మాస్త్రతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రణబీర్, పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నారు. ప్రజెంట్ వార్ 2 వర్క్‌లో బిజీ ఉన్న దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆ సినిమా పూర్తయిన వెంటనే బ్రహ్మాస్త్ర 2ను పట్టాలెక్కిస్తారు.

వరుసగా మూడు సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ లైన్‌లో ఉండటంతో రణబీర్ సీక్వెల్ స్టార్‌గా మారుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీస్ కంప్లీట్ చేసి కొత్త జానర్ ట్రై చేయడానికి చాలా టైమ్ పడుతుందంటున్నారు బాలీవుడ్ జనాలు.