
బాలీవుడ్ నటి పూనమ్ పాండే కన్నుమూసింది. ఆమె మరణ వార్తతో బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. ఆమె వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. గతకొంతకాలంగా కేన్సర్‌తో పోరాడుతున్న పూనమ్ పాండే.. తాజాగా పరిస్థితి విషమించడంతో మరణించిందని తెలుస్తోంది.

సర్వైకల్ కేన్సర్‌తో చికిత్స పొందుతూ పూనమ్ పాండే మృతి చెందిందని తెలుస్తోంది. ఇటీవలే అయోధ్య విగ్రహ ప్రతిష్టరోజు యాక్టివ్‌గా కనిపించింది పూనమ్.

హిందీలో 'నషా' సినిమాతో పరిచయమైంది పూనమ్. 1991లో కాన్ఫూర్‌లో పూనమ్ జన్మించింది. 2018లో నటించిన 'ది జర్నీ ఆఫ్ కర్మ' ఆమెకు చివరి సినిమా.

2022లో లాక్‌అప్ షోలో కంటెస్టంట్‌గా పూనమ్ కనిపించింది. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానంటూ సంచలనం సృష్టించింది. ఆ స్టేట్‌మెంట్‌తో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది..

అయితే పబ్లిక్ అప్రూవల్ రాకపోవడంతో వెనక్కి తగ్గింది. బీసీసీఐ తనకు పర్మిషన్ ఇవ్వలేదని పూనమ్ పాండే అప్పట్లో చెప్పుకొచ్చింది. కెరీర్ మొత్తం సినిమాల్లో, సోషల్ మీడియాలో ఎప్పుడూ సంచలనాల్లో ఉంటూనే వచ్చింది.

'మాలిని అండ్ కో' మూవీతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన పూనమ్.. ఇప్పుడు క్యాన్సర్‌తో 32 ఏళ్లకే కన్నుమూసింది.