
సినీ పరిశ్రమలో బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల కలల రాకూమారి. ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది అందాల తార.

ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో సందడి చేస్తుంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. పూల ట్రెండీ డ్రెస్లో మెరిసిపోతూ.. చిరునవ్వుతోనే కట్టిపడేస్తుంది ఈ అందాల తార.

యాభై ఆరేళ్ల వయసులోనూ తరగని అందంతో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. కాలం ఆమె అందానికి ఎప్పుడూ దాసోహమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మాధురీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంది. ఆమె భర్త శ్రీరామ్ మాధవ్. వీరి వివాహం 1999లో జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు.