
1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.

తాజాగా ప్రభాస్‌పై అర్షద్ వార్షి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు వాళ్లకెందుకు అంత కడుపుమంట..? కరోనా తర్వాత నార్త్‌పై సౌత్ డామినేషన్ మొదలైంది.. ఒక్కముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ దండయాత్ర నడుస్తుందిప్పుడు.

ఖాన్స్ కంటే ఎక్కువగా మన ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ సినిమాలు చూడ్డానికే నార్త్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అక్కడి నటులు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ప్రభాస్ జోకర్ అంటూ అర్షద్ వార్షీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వింటున్నారుగా.. కల్కి సినిమాలో ప్రభాస్ తనకి జోకర్‌లా కనిపించారని.. అమితాబ్ బచ్చన్ మాత్రం అద్భుతం అంటూ పొగిడేసారు అర్షద్ వార్షి. ఓ సినిమా నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది కానీ చెప్పే విధానం ఒకటుంటుంది.

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా అవుతున్నారు. దశాబ్దాల తరువాత క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

తనకు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ బాగా నచ్చిందని.. కానీ RRR మాత్రం పూర్తిగా చూడలేకపోయానంటూ కామెంట్ చేసారు. రాజమౌళి సినిమా తనకు అస్సలు నచ్చలేదంటూ విమర్శల పాలయ్యారు నసీరుద్ధీన్.

హీరోలనే కాదు.. సౌత్ దర్శకుల క్రేజ్‌ను వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఆ మధ్య సందీప్ వంగా యానిమల్ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు పరోక్షంగా కామెంట్ చేసారు. మహిళలపై జరిగే దాడుల్ని ప్రోత్సహించే విధంగా సినిమా ఉందంటూ సెటైర్లు వేసారు. వీళ్ళే కాదు.. చాలా మంది సౌత్ టెక్నీషియన్స్, హీరోలపై నోరు జారుతూనే ఉన్నారు.