- Telugu News Photo Gallery Cinema photos High expectations for Janhvi Kapoor on Devara movie after other Bollywood heroines didn't get much success
Janhvi Kapoor: సౌత్ పై ఫుల్ ఫోకస్ చేసిన జాన్వీ.. దేవర లో చిన్న శ్రీదేవి మార్క్.!
కొత్త హీరోయిన్లు మన దగ్గర తళుక్కుమంటారనుకున్న ప్రతిసారీ వాళ్ల భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉండబోతోందనే ఇంట్రస్ట్ ఆటోమేటిగ్గా కనిపిస్తూనే ఉంటుంది. అందులోనూ ఆల్రెడీ ఓ ఇండస్ట్రీలో మెప్పించిన భామలు, మన దగ్గర ఎలాంటి రిజల్ట్ చూస్తారనే ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో అనన్య పాండే జోరు చూసిన వారందరూ, ఈ లేడీ సౌత్ కెరీర్ మామూలుగా ఉండదని అనుకున్నారు.
Updated on: Aug 22, 2024 | 12:53 PM

ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న జూనియర్ శ్రీదేవి, ప్రతీ చిన్న విషయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

అందులోనూ ఆల్రెడీ ఓ ఇండస్ట్రీలో మెప్పించిన భామలు, మన దగ్గర ఎలాంటి రిజల్ట్ చూస్తారనే ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో అనన్య పాండే జోరు చూసిన వారందరూ, ఈ లేడీ సౌత్ కెరీర్ మామూలుగా ఉండదని అనుకున్నారు.

మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా, భాగ్యశ్రీ నటకు మంచి మార్కులే పడ్డాయి. అయినా ఇప్పటిదాకా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద చడీచప్పుడూ వినిపించడం లేదు.

సినిమా సక్సెస్ అయితే హీరోయిన్లకు గోల్డెన్ లెగ్ ట్యాగ్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. రీసెంట్‌గా కల్కి సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన దీపిక పదుకోన్‌ని గోల్డెన్ దివా అని మెచ్చుకుంటున్నారు జనాలు.

దీపిక పదుకోన్‌ని మాత్రమే కాదు, దిశా పాట్నిని కూడా అలాగే ప్రశంసిస్తున్నారు. కనిపించింది ఒక సాంగ్‌లో, కొన్ని సీన్లలోనే అయినా, దిశా పాట్ని కి ఈ సారి సౌత్ ఎంట్రీ కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.

కంగువ కూడా క్లిక్ అయితే, ఇక్కడ ఈ భామకు తిరుగు ఉండదన్నది క్రిటిక్స్ చెబుతున్న మాట. వీళ్లందరి సంగతి సరే.. మా దేవర బ్యూటీ జాన్వీ గురించి కూడా చెప్పండి.

బ్యాక్ టు బ్యాక్ ట్రిపుల్ ఆర్ హీరోల మూవీస్‌కి సైన్ చేసిన ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉండబోతోంది? అనే చర్చ గట్టిగానే జరుగుతోంది ఇండస్ట్రీలో.




