
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నబీల్ అఫ్రిదీ కూడా ఒకడు. మొదట్లో పెద్దగా ఆకట్టుకోని అతను క్రమంగా రాటు దేలాడు. బిగ్ బాస్ ఆటను బాగా వంట పట్టించుకుని ఇప్పుడు హౌస్ లోనే స్గ్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా మారిపోయాడు.

తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకుంటున్నాడు నబీల్. దీంతో నాలుగో వారం ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడీ తెలంగాణ కుర్రాడు.

హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోనియాతో ఢీ అంటే ఢీ అనే రేంజులో తలపడుతున్నాడు నబీల్. ఈ కారణంగానే అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

బిగ్‌బాస్ హౌసులో స్గ్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతోన్న నబీల్.. తాజాగా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు. తనతో పాటు వీడియోల్లో నటించిన ఆద్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు.

ఆద్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తనతో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేసిన నబీల్ అందులో తన ప్రేమనంతా బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్యూట్ పెయిర్, జోడీ బాగుంది అంటూ నబీల్- ఆద్యలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.