
ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల బులయ్యా 2. ఈ సినిమాతో హీరో కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్‌గా మారిపోయారు. భూల్ బులయ్యా కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్‌ను సిద్ధం చేశారు మేకర్స్. అంతేకాదు థర్డ్ పార్ట్‌లో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

సౌత్‌లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్‌లో భూల్ బులయ్యా పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో అదే కాన్సెప్ట్‌ను కొనసాగిస్తూ భూల్ బులయ్యా 2 రూపొందించారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్ కూడా సూపర్ హిట్ కావటంతో పార్ట్ 3 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సీక్వెల్‌కు భారీ హైప్ రావటంతో పార్ట్ 3ని వెంటనే పట్టాలెక్కించారు మేకర్స్. త్రీక్వెల్ కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తొలి భాగంలొ మంజులికగా విద్యాబాలన్ నటించారు. పార్ట్ 2లో ఆ పాత్రలో టబు కనిపించారు.

కానీ త్రీక్వెల్ విషయంలో మాత్రం ఒరిజినల్ మంజులికనే మళ్లీ బరిలోకి దించారు మేకర్స్. తొలి భాగంలో అందరినీ భయపెట్టిన విద్యాబాలన్ పార్ట్ 3లో మరోసారి మంజులిక పాత్రలో నటించారు.

అయితే ఈ సారి విద్యాతో పాటు సీనియర్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కూడా మంజులికగా భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ట్రైలర్‌లో ఇద్దరు మంజులికలను చూపించిన మేకర్స్, అసలు మంజులిక ఎవరో తెలియాలంటే సినిమా చూడాలంటూ ట్విస్ట్ ఇచ్చారు.