
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రియా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తల్లి అయినా, ఇప్పటికీ తన గ్లామర్‌తో అందరి మనసులు దోచేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

శ్రియా టాలీవుడ్‌లో ఒకప్పుడూ తన హవా చూపించింది. చిరంజీవి నుంచి నాగార్జున, బాలకృష్ణ, ఇలా అందరి సరసన నటించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందుకుంది. తర్వాత వివాహం చేసుకొని, ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరమైంది.

కరోనా తర్వాత పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయించిన ఈ చిన్నది, మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. యంగ్ హీరోలకు తల్లి పాత్రలు పోషిస్తూ, తన నటనతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంటుంది. సెలక్టీవ్ పాత్రలను చేస్తూ, తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది.

ఇక ఈ అమ్మడు సినిమాల కంటే తన ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ముఖ్యంగా ఏ కాస్త సమయం దొరికినా తన కూతురో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో తన కూతురుతో చిల్ అవుతున్న పొటోస్ షేర్ చేసింది.

తాజాగా తన కూతురుతో వెకేషన్‌కి వెళ్లిన ఈ అమ్మడు తనతో ఆడుకుంటూ, చాలా సంతోషంగా ఉన్న ఫొటోలు షేర్ చేసింది, ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.