
పెళ్లి సందడి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన నటన, అదంతో ఎంతో మంది మనసు దోచుకుంది. ఇక ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్న ఈ చిన్నదానికి మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంది.

ఏకంగా 9 సినిమాలకు సైన్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాల్లో చాలా వరకు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీ తెలుగులో ఊహించిన రేంజ్‌లో అవకాశాలు ఏం రాలేదు.

దీంతో బాలీవుడ్ పై కన్నేసి అక్కడ ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత పుష్ప2లో ఐటమ్ సాంగ్ చేసి పాపులారిటీ సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు గ్రాఫ్ మళ్లీ పెరిగింది. ప్రస్తుతం శ్రీలీల ఓ వైపు సినిమాలు, మరో వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక కాస్త సమయం దొరికినా చాలు ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాకటివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అలనాటి హీరోయిన్స్ లా రెడీ అయిపోయి తన అంద చందాలతో నెట్టింట రచ్చచేస్తోంది.

చీరకట్టులో, ఒంటి నిండా నగలు ధరించి, కొత్త లుక్‌లో చాలా అందంగా ఉంది ఈ బ్యూటీ. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ, న్యూ లుక్‌లో శ్రీలీల మహారాణిలా, అందంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మరికొంత మంది పాత హీరోయిన్‌లా చాలా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.