
గ్లామర్ షో మాత్రమే కాదు... యాక్షన్ థ్రిల్స్ చూపించే సత్తా కూడా మాలో ఉందని ప్రూవ్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీస్. ఓ వైపు గ్లామర్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూనే యాక్షన్ యాంగిల్‌ను కూడా గట్టిగానే చూపిస్తున్నారు.

రీసెంట్ టైమ్స్‌లో ఈ లిస్ట్‌లో చేరుతున్న బ్యూటీస్ నెంబర్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ అన్న ఇమేజ్‌కు తెరపడింది. సినిమా కథలో ఫిల్లింగ్ ఎలిమెంట్‌లా వచ్చి పోయే స్టీరియోటైప్ హీరోయిన్ రోల్స్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు బ్యూటీస్.

జవాన్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సాలిడ్ యాక్షన్ సీన్స్‌లో నటించారు.

టైగర్ సిరీస్‌లో పాకిస్థాన్ ఏజెంట్‌గా నటిస్తున్న కత్రినా కైఫ్.. యాక్షన్ సీన్స్ అదరగొడుతున్నారు. ఆల్రెడీ రెండు ఇన్‌స్టాల్మెంట్స్‌లోనూ తన మజిల్ స్ట్రెంగ్త్ చూపించిన క్యాట్.. థర్డ్ పార్ట్‌లో మరింత ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌లో కనిపించబోతున్నారు.

హాలీవుడ్ మూవీ ట్రిపులెక్స్‌తో యాక్షన్ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దీపిక, రీసెంట్‌గా పఠాన్ సినిమాలో పాకిస్థాన్ ఏజెంట్‌గా ఫైట్స్ ఇరగదీశారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సింగం ఎగైన్‌లోనూ యాక్షన్ సీన్స్‌లో కనిపించబోతున్నారు దీపిక.

ఈ మధ్యే సీతమ్మగా సాఫ్ట్ లుక్‌లో కనిపించిన కృతి సనన్, షార్ట్ గ్యాప్‌లో యాక్షన్ థ్రిల్స్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. టైగర్ ష్రాఫ్‌కు జోడిగా నటించిన గణపత్ సినిమాలో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు.

క్యూట్ బ్యూటీ అలియా కూడా యాక్షన్ ఇమేజ్‌కు రెడీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో అలాంటి రోల్స్ చేసినా ఈ మధ్య కాలంలో అలియా యాక్షన్ సీన్స్‌లో కనిపించలేదు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్‌లో చాలా కాలం తరువాత యాక్షన్ సీన్స్‌లో నటించారు అలియా భట్.