Film News: అన్‌స్టాపబుల్‌కు ఆ ఫ్యామిలీ హీరో.. ఎన్టీఆర్ 31పై నీల్ క్లారిటీ..

|

Dec 24, 2024 | 3:33 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమా గోట్. దీని మరో వర్షన్ చర్చ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై గాసిప్స్‎కి చెక్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్‌ కథపై దిల్ రాజు అప్‌డేట్. చెల్లితో సాయి పల్లవి ఎంజాయ్. ఎలాంటి టాలీవుడ్ సినిమా అప్‌డేట్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం రండి.. 

1 / 5
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో రన్ అవుతోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఈ టాక్ షోకు వచ్చి తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. తాజాగా ఈ షోకు విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు. ప్రోమో కూడా విడుదలైంది.

2 / 5
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ అని.. తారక్ కోసం నీల్ కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఇది మైథాలజి కాదని.. పీరియడ్ సినిమా అని చెప్పుకొచ్చారు.

3 / 5
చాలా ఏళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో పొలిటికల్ సబ్జెక్ట్ చేస్తున్నారు శంకర్. తాజాగా ఈ చిత్ర కథపై మేజర్ అప్‌డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్లూ ఉండేవి.. కానీ ఉంటాయని తేల్చేసారు నిర్మాత దిల్ రాజు. డల్లాస్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ అప్‌డేట్ చెప్పారు దిల్ రాజు.

4 / 5
 సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి కూడా టైమ్ ఇస్తుంటారు హీరోయిన్ సాయి పల్లవి. ఇప్పుడు కూడా ఇదే చేసారు. ఓవైపు తండేల్ సహా మరో మూడు సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్.. చెల్లితో కలిసి ఆస్ట్రేలియా టూర్ వెళ్లారు. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 / 5
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమా గోట్. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లకు పైగానే వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్‌డేట్ చెప్పారు దర్శకుడు వెంకట్. గోట్ మరో వర్షన్ రజినీకాంత్‌కు నెరేట్ చేసినట్లు చెప్పుకొచ్చారీయన.