
Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. భారీ సెట్‌లో పాటను చిత్రీకరిస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ మూవీగా భగవంత్ కేసరిని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు మేకర్స్.

Double ismart: రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రామ్, సంజయ్ దత్‌తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. సెకండ్ షెడ్యూల్‌ని ఫారిన్‌లో ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది డబుల్ ఇస్మార్ట్.

OMG 2: అక్షయ్‌కుమార్, యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి నటిస్తున్న డ్రామా సినిమా 'ఓమైగాడ్2'. ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ వితౌట్ కట్స్ తో 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని సన్నివేశాలను, డైలాగులను, కేరక్టర్లను దృష్టిలో పెట్టుకుని 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.

Shivarajkumar: రజనీకాంత్, శివరాజ్‌కుమార్ నటించిన సినిమా జైలర్. ఈ నెల 10న విడుదల కానుంది. రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు శివరాజ్‌కుమార్. ఆయనతో మాట్లాడితే తన తండ్రితో మాట్లాడినట్టు ఉంటుందని అన్నారు. సినిమాలో తన కేరక్టర్ నిడివి 12 నిమిషాలు ఉంటుందని అన్నారు.

Tamannaah Bhatia: విజయ్‌తో నటించిన సుర సినిమా గురించి తమన్నా చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తన నటన తనకు అసలు నచ్చలేదని చెప్పారు తమన్నా. షూటింగ్ సమయంలో సినిమా బాగోలేదని అర్థమైందని, కానీ, పూర్తి చేయడం కర్తవ్యం కాబట్టి చేశానని చెప్పారు.