Rajeev Rayala | Edited By: Ravi Kiran
Oct 14, 2021 | 6:32 AM
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది అవికా గోర్
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అవికా
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది ఈ బ్యూటీ.
తెలుగులో సరైన హిట్ పడకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది
ఇప్పుడు తిరిగి తెలుగులో అవకాశాలు దక్కించుకుంటుంది అవికా
మరో వైపు నిర్మాతగా మారింది అవికా గోర్
ఇప్పుడు ఈ బ్యూటీ నిర్మాతగా తన మొదటి వెంచర్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
అవికా గోవాలో తొలి ప్రొడక్షన్ వెంచర్ కోసం షూటింగ్ లో పాల్గొంటోంది.
ఇది నా మొదటి ప్రొడక్షన్ కనుక ఇది అద్భుతమైన అనుభవం. మేం గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నాం అంటూ చెప్పకోచింది అవికా