
ఈ మధ్యకాలంలో తెలుగుతెరపై పొరిగింటి అందాలు తళుక్కుమంటున్నాయి. టాలీవుడ్ సినిమాలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ కోవలోనే తాజాగా ఓ సినిమాలో తళుక్కుమంది అతుల్య రవి.

2017లో ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ డజనుకు పైగా సినిమాల్లో నటించింది.

తెలుగుతెరపైకి 'మీటర్' సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో కిరణ్ అబ్బవరం హీరో.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడకపోయినా.. అతుల్య అందానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ఆ సమయంలో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు తలుపు తడతాయని అందరూ అనుకున్నారు.

ఇక అతుల్య కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోస్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటోంది.

అలా లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.