
ఆషిక రంగనాథ్.. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2016లో వచ్చిన క్రేజీ బాయ్ సినిమాతో పరిచయం అయ్యింది.

ఆతర్వాత అక్కడ చాలా సినిమాల్లో నటించింది ఆషిక రంగనాథ్. అక్కడ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఆషిక రంగనాథ్.

అలాగే 2023లో వచ్చిన అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఆషిక రంగనాథ్. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

అమిగోస్ సినిమాలో ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్లో తన అందచందాలతో కవ్వించింది ఆషిక రంగనాథ్.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.