విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి అలరించింది.
అర్జున్ రెడ్డి సినిమాలో అమాయకపు యువతిగా కనిపించిన షాలిని పాండే.. ఆ సినిమా సినిమా సక్సెస్ తర్వాత వరుసగా ఛాన్స్ లు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మెప్పించిన ఈ వయ్యారి భామ. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది.
ఇక ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరిగా అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.
అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ ఆంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి సినిమాలో అమాయకంగా కనిపించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో అందాలతో ఓ రేంజ్ లో గత్తర లేపుతోంది.
ఇంత అందం పెట్టుకొని ఈ చిన్నదానికి అవకాశాలు ఎందుకు రావడంలేదు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. షాలిని పాండే ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.