
లాస్ట్ ఇయర్ శ్రుతిహాసన్ పేరు మీదున్న రికార్డును ఈ ఇయర్ ఎలాగైనా బీట్ చేయాలని ట్రై చేస్తున్నారు ఉంగరాల జుట్టు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. రవితేజ హీరోగా నటించిన ఈగిల్‌లో అనుపమ హీరోయిన్‌గా నటించారు. సక్సెస్‌ఫుల్ డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్‌లోనూ అనుపమే నాయిక.

2024లో తెలుగులో అనుపమకున్న రిలీజ్‌లు ఇవి. తమిళ్‌లో జయం రవితో సైరన్ అని ఓ సినిమా చేస్తున్నారు. అటు మలయాళంలోనూ ఈ బ్యూటీ చేతిలో ఇంకో సినిమా ఉంది. లాస్ట్ ఇయర్ శ్రుతి నాలుగు సినిమాలతో సక్సెస్ చూశారు. ఆ నెంబర్‌ని బీట్ చేయాలన్నదే అనుపమ లక్ష్యం.

స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ గురించి ఈ మధ్య తరచూ ఏదో ఒక రూపంలో వింటూనే ఉన్నాం. ఆ మధ్య జవాన్‌లో విజయ్ ఉన్నారని, లియోలో సూర్య కనిపిస్తారని, ఈ మధ్య సలార్‌లో యష్ ఉన్నారని రకరకాలుగా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

ఇలాంటిదే ఇప్పుడు ఇంకో ఇంట్రస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. సౌత్ రాక్‌స్టార్ యష్ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ గెస్ట్ రోల్ చేస్తున్నారన్నది ఇప్పుడు వైరల్ న్యూస్. ఇందులో నిజానిజాలు ఏంటన్నది తెలియాలంటే యష్ యాక్ట్ చేస్తున్న టాక్సిక్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

రామ్ చరణ్‌ని చూసి జెలస్ ఫీలవుతున్నానని అంటున్నారు ఉపాసన. అది కూడా కుమార్తె క్లీంకార విషయంలోనే అని ఓపెన్ చెబుతున్నారు ఉపాసన. చరణ్‌ని చూడగానే క్లీంకార ముఖం మీద మంచి వెలుగు కనిపిస్తుందట. ఆమె కళ్లల్లో మెరుపు, ఆ ఉత్సాహం చూస్తే తనకు కాస్త జెలసీగా ఉంటుందని అంటున్నారు ఉపాసన. పాప బాధ్యతలను ఇద్దరూ సమానంగా చూసుకుంటున్నామని, కెరీర్‌ని, కుటుంబాన్ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు ఉపాసన.