
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో అనుపమ పరమేశ్వరన్ క్రేజే వేరు. ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాలో నటించింది.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది అనుపమ. ఆతర్వాత ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోయింది. సోలో హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ వయ్యారి తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అయితే అనుపమ పరమేశ్వరన్ ఇప్పటివరకు రొమాంటిక్ సీస్స్ లో నటించలేదు. అలాగే బోల్డ్ గానూ కనిపించలేదు. మొన్నామధ్య మాత్రం రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ తో షాక్ ఇచ్చింది. దాంతో అభిమానులంతా అవాక్ అయ్యారు.

అనుపమ ఇలా లిప్ లాక్ తో రెచ్చిపోయిందేంటి అంటూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది అనుపమ. అయితే ఈ సినిమాలో అనుపమ మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం అనుపమ లేడీఓరియేంటేడ్ సినిమాలు చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో కొన్ని ఫోటోలు షేర్ చేసింది . ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.