
అనుపమ పరమేశ్వరన్.. తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ప్రేమమ్, ఆ ఆ, శతమానం భవతి అంటూ వరుసగా మూడు విజయాలతో ఎంటర్ అయింది.. కానీ ఆ తర్వాత అదే జోరు చూపించడంలో పూర్తిగా విఫలమైంది. మధ్యలో రంగస్థలం లాంటి సినిమాలలో ఆఫర్స్ వచ్చినా కూడా పారితోషికం మరీ ఎక్కువ కావాలని డిమాండ్ చేసి.. అనవసరంగా వచ్చిన అవకాశాలను కూడా పాడు చేసుకుని వాటికి భారీ మూల్యం చెల్లించింది అనుపమ పరమేశ్వరన్.

ఇప్పటికీ వరుసగా సినిమాలైతే చేస్తుంది కానీ దానికి తగ్గ గుర్తింపు మాత్రం అనుపమకు రావడం లేదు. ఈ మధ్య కాలంలో గ్లామర్ షో కూడా బాగానే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు నడుము చూపించడానికి కూడా ఇబ్బంది పడిన అనుపమ..

ఇప్పుడు ఏకంగా క్లీవేజ్ షో కూడా చేస్తుంది. ఈమెలో వచ్చిన మార్పులు చూసి దర్శక నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ కూడా బాగానే చేసింది.

ఆ తర్వాత కచ్చితంగా అవకాశాలు బాగానే వస్తాయని కలలు కంది.. కానీ అలాంటిదేమీ జరగలేదు. నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్, కార్తికేయ 2లలో నటించి మెప్పించింది అనుపమ. ప్రస్తుతం తెలుగులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న DJ టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇందులో కూడా బాగానే గ్లామర్ షో చూస్తుంది అనుపమ పరమేశ్వరన్. ఇప్పటికే విడుదలైన ఒక పాటలో ఆమె గ్లామర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు టిల్లు స్క్వేర్ మరో ఎత్తు అన్నట్టు ఉంది ఈ సినిమాలో అనుపమ షో.

ఒక పాటకి ఇంత ఉంటే రేపు సినిమాలో ఎలా ఉంటుందో అనే ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులకు స్వీట్ షాక్ ఇస్తుంది అనుపమ.

తాజాగా మరోసారి అలాంటి ఫోటోషూట్ తోనే వచ్చింది ముద్దుగుమ్మ. అది చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. నడుము చూపిస్తూ బాగానే రెచ్చగొడుతుంది అనుపమ. ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నా కూడా దర్శక నిర్మాతలు మాత్రం ఈమెపై ఎందుకో మరి శీతకన్ను వేశారు.

ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు స్టార్ హీరో సినిమాలో నటించలేదు అనుపమ. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ లో ఈమె హీరోయిన్. అయితే ఇందులో అనుపమ క్యారెక్టర్ లెన్త్ తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. మొత్తానికి ఇటు టిల్లు స్క్వేర్ అటు ఈగల్ మీదే ఈమె ఆశలన్నీ ఉన్నాయి.