Movie News: ఆహాలో ‘యానిమల్’ రచ్చ.. ఆ రోజున ‘హాయ్ నాన్న’ పెయిడ్ ప్రీమియర్స్..

| Edited By: Prudvi Battula

Nov 27, 2023 | 10:38 AM

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా యానిమల్. రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. నాని హీరోగా కొత్త దర్శకుడు శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమా హాయ్ నాన్న. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు విజయ్ ఆంటోనీ. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం.

1 / 5
రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా యానిమల్. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మధ్యే యానిమల్ టీం ఆహాలోని అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు. నవంబర్ 24 నుంచి ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రికార్డ్ వ్యూస్‌తో రచ్చ చేస్తుంది యానిమల్ ఎపిసోడ్. బాలయ్యతో రణ్‌బీర్ కపూర్ చేసిన అల్లరి అదరహో అనిపిస్తుంది. 

2 / 5
 రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మ ఎంపికయ్యారు. ఈ విషయం ముందుగానే తెలిసినా కూడా.. అధికారికంగా మాత్రం ఇప్పుడే బయటపెట్టారు యూనిట్. మణిశర్మతో ఉన్న ఫోటోను విడుదల చేసారు పూరీ. గతంలో ఇస్మార్ట్ శంకర్‌కు ఈయన ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

3 / 5
నాని హీరోగా కొత్త దర్శకుడు శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమా హాయ్ నాన్న. ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రమోషన్స్ కూడా అలాగే చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 7న విడుదల కానున్న హాయ్ నాన్న ప్రీమియర్స్ ముందు రోజు రాత్రి పడబోతున్నాయి. మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4 / 5
 హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈయన హీరోగా నటిస్తున్న విక్రమ్ రాథోడ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. సురేష్ గోపి, రమ్య నంబీశన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబు యోగేశ్వరన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బిచ్చగాడు 2తో ఈ మధ్యే తెలుగులోనూ హిట్ అందుకున్నారు విజయ్ ఆంటోనీ.

5 / 5
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం. సత్యారెడ్డి నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నటిస్తున్నారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన ఉద్యమం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను గద్దర్ కూతురు వెన్నెల విడుదల చేశారు.