
ఆండ్రియా జర్మియా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు సింగర్ గా, నటిగా తన ప్రతిభను చాటుకుంటుంది.

కార్తీ హీరోగా నటించిన యుగానికొక్కడు సినిమాతో ఆండ్రియా జర్మియా కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది.

యుగానికొక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. తడాఖా సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

ఆండ్రియా జర్మియా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలో నటించి మెప్పించింది. అలాగే అతిథి పాత్రలోనూ నటించి మెప్పించింది.

ఇక ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ క్రేజీ ఫొటోస్ షేర్ చేసింది.