
యాంకర్ అనసూయ (Anasuya).. ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఓవైపు బుల్లితెరపై..మరోవైపు వెండితెరపై తన నటనతో దూసుకుపోతుంది.

ఇటీవల పుష్ప(Pushpa) సినిమాతో దాక్షాయణిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనసూయ. ఈ మూవీలో అనసూయ తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది.

బుల్లితెరపై ఎంతో గ్లామరస్తో కనిపించే అనసూయ… సినిమాల్లో మాత్రం పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంది.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఢీగ్లామరస్ లుక్లో కనిపించి తన నటనతో ప్రశంసలు అందుకుంటుంది అనసూయ.

అందుకే అనసూయ కోసం ఛాలెంజింగ్ రోల్స్ ఇవ్వడానికైన దర్శకనిర్మాతలు సిద్ధపడిపోతున్నారు. ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలతో బిజిగా ఉంది.

ఈ యాంకరమ్మ.. మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడి సినిమాలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే.

రవితేజకు అత్త పాత్రలో అనసూయ కనిపించబోతుందట. ఆమె పోషించిన చంద్రకళ పాత్ర ఈ సినిమాకు హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.