
అందరూ అనుకున్నట్టుగానే పుష్ప2 ది రూల్ విడుదల వాయిదా పడింది. గతంలో పుష్ప రిలీజ్ అయిన డిసెంబర్ నెలకే ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. డిసెంబర్ 6న రావడం పక్కా అని ఢంకా భజాయించి చెబుతున్నారు మేకర్స్. ఇంతకీ విడుదల వాయిదా పడటానికి రీజన్ ఏంటో తెలుసా... చూసేద్దాం రండి...

అక్కడికి కూడా ఒంటరిగా వెళ్లలేదు. లిరిక్ రైటర్ చంద్రబోస్‌ని వెంట పెట్టుకునే వెళ్లారు. అక్కడ ఖాళీ సమయంలో సంగీత చర్చలు సాగించాలన్నది మాస్టర్ వేసిన ప్లాన్.

బన్నీ ట్రిమ్ చేసింది కూడా జస్ట్ రెండు పాయింట్లే. సో, ఈ నెలాఖరుకు ఆ మాత్రం గడ్డం పెరగడం కూడా పెద్ద విషయమేం కాదు. షెడ్యూల్ గ్యాప్ వచ్చేసరికి ఎవరికి వారు కహానీలు అల్లుకున్నారు కానీ, అందులో కించిత్తు కూడా నిజం లేదన్నది మేకర్స్ వైపు నుంచి వినిపిస్తున్న మాట.

అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో బిజీ బిజీగా నడుస్తుంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుకుమార్. డిసెంబర్ 6నే ఈ చిత్రం వస్తుందంటున్నారు మేకర్స్.

ఇటలీకి ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లాలన్నది కూడా బన్నీ సడన్‌గా తీసుకున్న డెసిషన్ కాదు. ఎప్పటి నుంచో అనుకున్నదే. కరెక్ట్ గా కుదిరింది కాబట్టి, కొన్నాళ్లు ట్రిప్‌కి వెళ్లారు. ఈ నెలాఖరుకు ఫ్రెష్ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ టైమ్ కి ఫాహద్ ఫాజిల్ కూడా సెట్స్ కి జాయిన్ అవుతారు.