అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత.. దాన్ని మించేలా పుష్పతో రికార్డులతో చెడుగుడు ఆడుకున్నారు. పుష్ప ఏమో గానీ.. పార్ట్ 2 మాత్రం ఏకంగా 1800 కోట్లు వసూలు చేసి బన్నీ రేంజ్‌ని అమాంతం పెంచేసింది.
ఇంత పెద్ద హిట్ వచ్చింది కాబట్టే.. కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. పుష్ప 2 తర్వాత ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా.. ఆడియన్స్‌కు అది ఎక్కడం కష్టమే. అందుకే ఈసారి రూట్ మారుస్తున్నారు బన్నీ.
అట్లీతో చేయబోయే సినిమా జోనర్ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రాలేదని తెలుస్తుంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్‌తో యాక్షన్ జోనర్‌లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.
అట్లీ సినిమాతో కొత్త జోనర్ ట్రై చేస్తున్న బన్నీ.. త్రివిక్రమ్ కోసం మరో జోనర్‌లోకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ, గురూజీ.
ఈ కాంబో అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇంకాస్త భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబో. అట్లీ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైనే ఉండబోతుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే మైథలాజికల్ జోనర్‌లో నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతుంది. తను చేయబోయే నెక్ట్స్ రెండు సినిమాలు డిఫెరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ.. కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యేలా డిజైన్ చేసుకుంటున్నారు అల్లు వారబ్బాయి.