పుష్ప 2 పాన్ ఇండియా ప్రెస్‌మీట్ ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్‌కు తెర లేపింది. ఇప్పటికే మన సినిమాకు అదర్ లాంగ్వేజెస్‌లో అనుకున్న స్థాయిలో రిసెప్షన్ ఉండటం లేదన్న కంప్లయిట్స్ ఉన్నాయి. ఇతర ఇండస్ట్రీల్లో తమ సొంత సినిమాలకు ఇస్తున్న ప్రియారిటీ తెలుగు సినిమాలకు ఇవ్వటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో పుష్ప 2కు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్న రేంజ్‌లో థియేటర్లు దొరుకుతాయా?
ప్రజెంట్ ఇండియా అంతా పుష్ప మేనియాలో ఉంది. తొలి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా అప్‌డేట్స్ ఇస్తోంది మూవీ టీమ్. తాజాగా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్‌తో పాన్ ఇండియా ప్రెస్‌మీట్ నిర్వహించిన మేకర్స్... ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కానీ రేంజ్‌లో రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తుట్టుగా వెల్లడించారు.
కన్నడ మార్కెట్‌లో పుష్పను భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వెల్లడించారు. సాండల్‌వుడ్ బిగ్గెస్ట్ మూవీ కేజీఎఫ్‌ను అక్కడ 350 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు పుష్పను అంతకు మించి 500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు డిస్ట్రిబ్యూటర్. కానీ కర్ణాటకలో ఆ రేంజ్ రిలీజ్ ఓ డబ్బింగ్ సినిమాకు సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. అసలు సాండల్‌వుడ్‌లో డబ్బింగ్ సినిమాలను ఈ మధ్యే అనుమతిస్తున్నారు. ఈ టైమ్‌లో బిగ్ రిలీజ్ అంటే అయ్యే పనేనా?
డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాను ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానీ స్థాయిలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ లెవల్‌లో ఆరు భాషల్లో 11500 స్క్రీన్స్‌లో పుష్ప 2 రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.
ఎంత పెద్ద సినిమా అయినా భారీ వసూళ్లు సాధించాలంటే మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వాలి. అందుకే స్టార్ హీరోలంతా మాస్ ఇమేజ్ కోసం కష్టాపడుతుంటారు.