అభిమాన హీరోలకు సంబంధించి పూటకో గుడ్‌న్యూస్ తెలుస్తూనే ఉన్నా, ఫ్యాన్స్ ఆశలకు అంతే ఉండదు. ఇంకేమైనా చెబుతారా? మాకోసం మరేమైనా దాచారా? అంటూ ఆరాలు తీస్తూనే ఉంటారు. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అల్లు ఆర్మీతో అన్నీ గుడ్‌న్యూస్‌లే షేర్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్.

నేషనల్ అవార్డుతో మొదలుపెట్టి మొన్న మొన్నటి జాతర లుక్ వరకూ.. ప్రతిదీ మాస్ జాతర చేసిన అప్‌డేటే.. అయినా.. నెక్స్ట్ ఏంటి? అనే మాట ఫ్యాన్స్ లో వినిపిస్తూనే ఉంది. కాళ్లకు గజ్జెలు, నడుముకు వడ్డాణం, మెడలో దండలు... అల్లు అర్జున్ అడుగుముందుకేస్తుంటే, శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయి చూసేశారు ఆయన మాస్ అభిమానులు.

ఈ విషయం ఐకాన్ స్టార్ కి చాల బాగా తెలుసు. అందుకే కో ఆర్టిస్టులకు సలహాలిస్తూ వారిలో ఈజ్ పెంచే ప్రయత్నం చేరారు అనే పోనప్ప మాటకి ఫుల్ ఖుషి అవుతుంది అల్లు ఆర్మీ.

అసలే ప్యాన్ ఇండియా లెవల్లో వెయ్యికోట్లకు పైగా వసూళ్లు తెచ్చుకున్న జవాన్ డైరక్టర్ చేసే ఇమీడియేట్ ప్రాజెక్ట్ అంటే.. ఐకాన్ స్టార్ ఎందుకు వదులుకుంటారు చెప్పండి... అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్‌లో. మరి ఆ మధ్య సందీప్ రెడ్డి వంగా బన్నీతో సినిమా చేస్తే బావుంటుందని అన్నారుగా.. దాని సంగతేంటి?

ఇప్పుడప్పుడే ఆ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవు. సందీప్ నార్త్ లో యానిమల్ పార్క్ చేయాలి, ప్రభాస్‌తో స్పిరిట్ చేయాలి.. కాబట్టి ఇమీడియేట్‌గా అయితే అది అసాధ్యం. సందీప్‌తోనే కాదు, త్రివిక్రమ్‌తోనూ ఇప్పుడప్పుడే సినిమా ఉండే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది.

బన్నీతో గురుజీ ఎప్పుడు సినిమా చేసినా బాక్సు బద్ధలైపోవాల్సిందే. 'అట్లుంటది మనతోని' అని ఇద్దరూ కాలరెగరేసుకుని చెప్పే స్టోరీ మీద వర్కవుట్ చేస్తున్నారట త్రివిక్రమ్. సో.. ఎన్ని విధాలుగా లెక్కలు వేసినా, ఇప్పటికైతే ఐకాన్‌స్టార్ కాంపౌండ్ గాలి.. అట్లీ వైపే వీస్తోంది.