
త్వరలోనే తల్లి కాబోతున్న కియారా మెట్‌గాలాలో స్పెషల్ అట్రాక్షన్. బేబీ బంప్‌తో ఆమె ఇచ్చిన ఫోజులకు ఫిదా అయిపోయారు జనాలు. ఈ ఫోటోలు సోషల్ మీడియా వైరల్ చేస్తూ మురిసిపోతున్న ఈ బ్యూటీ ఫ్యాన్స్.

కడుపులో ఉన్న బిడ్డతో.. బడ్డీ... నువ్ మెట్ గాలాలో ఉన్నావని చెబుతానని కియారా మురిసిపోతుంటే, ఛీయర్స్ చెబుతోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ పోస్ట్ చూసి మరో బాలీవుడ్ బ్యూటీ పెట్టిన పోస్ట్ కూడా తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు.

గార్జియస్ మమ్మా అంటూ కియారాను ఉద్దేశించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పెట్టిన పోస్టు కూడా వైరల్ అవుతోంది. ఇది కదా.. ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే తీరంటే అని ముచ్చటపడుతున్నారు మూవీ లవర్స్.

కియారా, ఆలియా ఇద్దరూ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి నటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. అలాగే మరో టాలీవుడ్ బ్యూటీ కూడా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా గుడ్‌న్యూస్ చెప్పేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కానున్నారనే వార్త గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ వాళ్లు న్యూస్ ఇవ్వడంతో హ్యాపీగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.