
కింగ్ నాగార్జున..! క్యాజుల్‌గా మాట్లాడుతారు. కూల్‌గా ఉంటారు. తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. తన వైపే అందరూ చూసేలా చేస్తారు.

కొత్త వారి ట్యాలెంట్‌ని వెలికి తీస్తారు. నయా ట్రెండ్స్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేస్తారు.

అమ్మాయిల కలల రాకుమారుడు.. అబ్బాయిలు కలలుగనే అందం ఉన్నవాడు. అక్కినేనికి తగ్గ వారసుడు.

90s హీరోల్లోనే అందగాడు.. ఆజానుబాహుడు. సకల కళా వల్లభుడు మన అక్కినేని నాగార్జునుడు.

అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నాగార్జున.

కెరీర్ మొదట్లో యాక్టింగ్ రాందంటూ.. హీరో ఫేస్ కాదంటూ ఎన్ని విమర్శలు ఎదర్కొన్నా.. అవన్నీ భరించి.. అధిగమించి.. స్టార్ హీరోగా.. ఇండస్ట్రీ టాప్ హీరోగా మారిపోయారు. మారిపోవడమే కాదు అక్కినేని లెగసీని ఎఫెక్టివ్‌గా ముందుకు తీసుకెళ్లారు.

విక్రమ్ నుంచి వైల్డ్ డాగ్ వరకు.. ఎన్నో ఎత్తు పల్లాలు.. ఎన్నో ఒడిదుడుకులు. లెక్కకు మించి రికార్డులు.. లెక్కల్లో ఉన్న డిజాస్టర్లు.. గ్రేట్ పర్ఫార్మెన్స్ అంటూ చప్పట్లు.. యాక్టింగే రాదంటూ.. దెప్పిపొడుపులు. ఇలా ఇవన్నీ తన సినీ జర్నీలో చూశారు కింగ్ నాగార్జున.

కొత్త డైరెక్టర్‌ని నమ్మి సినిమాకు కమిట్ అవ్వడం ఆయనే చెల్లింది. ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌లో హీరోగా నటించడం ఆయనకే చెల్లింది.

రొమాంటిక్ హీరోగా టాప్ గేర్లో దూసుకుపోతున్న టైంలోనే అన్నమయ్య లాంటి భక్తి సినిమాల్లో నటిచడమూ ఆయనకే చెల్లింది. బేజషాలు లేకుండా మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం.. కూడా ఆయనకే చెల్లింది.

ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల మందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున మోస్ట్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.