Akira Nandan: తనయుడిని పబ్లిక్‌లోకి తీసుకొస్తున్న పవన్‌ కల్యాణ్‌

Updated on: Feb 15, 2025 | 6:42 PM

రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. పైగా ఆయనిప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కూడా..! అందుకే ఇదివరకట్లా సినిమాలు చేయడం కుదరట్లేదు.. కుదరదు కూడా. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్‌కి చేరువ చేస్తున్నారా..? కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించడానికి కారణమదేనా..? అకీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా..?

1 / 5
తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నపుడు.. ఆ బాధ్యత వారసుడికి ఇస్తుంటారు. పవన్ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. రాజకీయంగా తను బిజీ అవుతానని తెలిసే.. అకీరాను ఆడియన్స్‌కు చేరువ చేస్తున్నట్లు కనిపిస్తుంది.

2 / 5
గతేడాది ఎన్నికల్లో విజయం సాధించాక.. వారసుడిని ఇటు చంద్రబాబు.. అటు ప్రధాని మోదీ దగ్గరికి తీసుకెళ్ళి నేషనల్ వైడ్‌గా అకీరాను ఫేమస్ అయ్యేలా చేసారు పవన్. అకీరా నందన్‌కు ఇప్పుడు 21 ఏళ్ళు.

3 / 5
నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్‌లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేసాక.. పవన్ పూర్తిగా పాలిటిక్స్‌పై ఫోకస్ చేయడం ఖాయం.

4 / 5
ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు. ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కూడా అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసొచ్చారు అకీరా.

5 / 5
ఇప్పుడు పవన్ చేస్తున్న సనాతన ధర్మ దీక్షలోనూ నాన్నతోనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అకీరాను వెండితెరపై చూడటం ఖాయమే అనిపిస్తుంది. అదే జరిగితే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవేమో..?