Akhanda 2: 150 కోట్ల బడ్జెట్ తో బోయపాటి బాలయ్య సినిమా.? అఖండ 2 నా.? స్క్రిప్ట్ మారిందా.?
బాలయ్యపై ఒకప్పుడు 50 కోట్లు బడ్జెట్ పెట్టాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే వాళ్లు నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు.. 50కి ముందు 1 పెట్టి.. 150 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యారు. ఈ గ్యాప్‌లోనే బాలయ్య మార్కెట్ అంతగా ఎలా పెరిగింది..? NBK 110 కోసం ఊహించని బడ్జెట్ పెట్టడానికి రీజన్ ఏంటి..? అఖండ 2 ఇదేనా లేదంటే దీని తర్వాత ఉండబోతుంది..? అఖండ తర్వాత బాలయ్య కెరీర్ రూపురేఖలు మారిపోయాయి.