
న్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ మరోసారి తళుక్కుమంది. ఇంతకు ముందు నలుపు, తెలుపు, బంగారు రంగుల్లో డిజైన్ చేసిన గౌనులో అబ్బురపరిచిన ఐశ్వర్య ఈసారి చమ్కీలా డ్రెస్ లో మెరిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఫిల్మ్ ఫెస్టివ ల్ లో భాగంగా కిండ్స్ ఆఫ్ కైండ్ నెస్ సినిమా ప్రదర్శనకు అమెరికా నటి, నిర్మాత, దర్శకురాలు ఈవా లాంగోరియా వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కెమెరాలకు పోజులిచ్చారు.

ఈ సందర్భంగా ఐశ్వర్య నీలం రంగు ఫాల్గుణి, షేన్ ధరించారు. ఈవా లాంగోరియా కూడా కలర్ ఫుల్ డ్రెస్ లో కనువిందు చేశారు. ఇక వీరిద్దరిని చూసేందుకు రెండు కళ్లూ చాలలేదు అక్కడి ఆహూతులకు.

కాగా ఐశ్వర్యరాయ్ చేతికి గాయమైంది. అయినా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. దీంతో ఈ అందాల తారపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యకు తోడుగా ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా తల్లీ కూతుళ్ల ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.