
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్. క్షణం సినిమాతో తన ఫ్యూచర్‌కు తానే రెడ్ కార్పెట్ వేసుకున్న ఈ యంగ్ హీరో అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నారు.

గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న శేష్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌ను టార్గెట్ చేస్తున్నారు. గూఢచారి సక్సెస్ తరువాత సీక్వెల్‌ను ఎనౌన్స్ చేసిన శేష్, ఆ సినిమాను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ప్లాన్ చేశారు. కానీ సినిమా ఆలస్యం కావటంతో జీ2 ఉంటుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి. ఈ అనుమానాలకు లేటెస్ట్ అప్‌డేట్‌తో చెక్ పెట్టారు శేష్.

లేటెస్ట్ అప్‌డేట్‌తో జీ2 మీద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు మేకర్స్. తాజాగా ఈ సినిమా స్టిల్స్ రిలీజ్ చేసి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేశారు.

బాలీవుడ్ బ్యూటీ వామికాగబ్బి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఆరు దేశాల్లో, 23 సెట్స్‌లో 150 రోజులకు పైగా షూటింగ్ చేసినట్టుగా వెల్లడించారు.

లేటెస్ట్ స్టిల్స్‌తో పాటు ఈ సారి యాక్షన్ గ్లోబల్ రేంజ్‌లో ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు జీ 2 మేకర్స్. వినయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.