Decoit: డెకాయిట్ సెట్‌లో అనుకోని ప్రమాదం..? నిజమేనా.. పబ్లిసిటీ స్టంటా..?

Edited By: Phani CH

Updated on: Jul 24, 2025 | 8:27 PM

కొన్నిసార్లు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నా కూడా అస్సలు ట్రెండ్ అవ్వవు.. సరిగ్గా అప్పుడే ఆ టీమ్ నుంచి ఏదో ఓ సెన్సేషనల్ న్యూస్ బయటికి వస్తుంటుంది. తాజాగా డెకాయిట్ సినిమా నుంచి అలాంటి న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సెట్‌లో ప్రమాదం.. హీరో హీరోయిన్లకు గాయాలు అని..! మరి ఇది నిజమేనా.. ఏదైనా పబ్లిసిటీ స్టంటా..?

1 / 5
తెలియకుండానే మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు అడివి శేష్. 2022లో హిట్ 2 వచ్చాక ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేస్తున్నారీయన.

2 / 5
ఇందులో డెకాయిట్ షూట్ చివరిదశకు వచ్చేయగా.. గూఢచారి 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ రెండూ తక్కువ గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి.

3 / 5
నానక్‌రామ్ గూడ పరిసర ప్రాంతాల్లో డెకాయిట్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా ప్ర‌మాదవ‌శాత్తూ హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కింద పడ్డారని.. వాళ్లకు గాయాలు బాగానే అయినట్లు తెలుస్తుంది.

4 / 5
అదే గాయాలతో షూట్ పూర్తి చేసారని ప్రచారం జరుగుతుంది. గ‌తంలోనూ డెకాయిట్ సెట్‌లో ఒకట్రెండు ప్రమాదాలు జరిగాయి. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. షానిల్ డియో ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ చిత్రం అడివి శేష్, శృతి హాసన్ జంటగా మొదలైంది.

5 / 5
కానీ మధ్యలో శృతి తప్పుకోవడంతో మృణాళ్ జాయిన్ అయ్యారు. అన్న‌పూర్ణ స్టూడియోస్‌పై సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న డెకాయిట్ విడుదల కానుంది. మొత్తానికి ఈ ప్రమాదం నిజమా పబ్లిసిటీ స్టంటా అనేది తెలియదు కానీ డెకాయిట్‌కు ప్రమోషన్ అయితే బాగానే వచ్చింది.