
టాలీవుడ్ రొమాంటిక్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీ రావు హైదరీ ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నారు. కొన్ని రోజుల క్రితేమే ఎంగేజ్‌మెంట్ చేసుకుని తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వీరిద్దరు ఏడడుగులు నడవనున్నారు.

తెలంగాణ లోని వనపర్తి జిల్లాలోని పురాతన రంగనాయక ఆలయంలో తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు సిద్ధార్థ్,అదితి. ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హజరయ్యారు.

ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అదితీ సిద్ధార్థ్ తో ప్రేమ వ్యవహారంపై ఆసక్తికర కామెంట్లు చేసింది.

తాము తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నామని అదితి తెలిపింది. పేరెంట్స్ తమ కంటే ఎంతో ప్రైవేట్‌గా ఉంటారని, వారికి కాల్స్ వస్తున్నందుకే తమ ప్రేమను బయటపెట్టామందీ అందాల తార.

తమ ఇద్దరి తల్లిదండ్రుల అనుమతితోనే ఈ నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని గ్రహించాలని కోరింది అదితి.