
వైష్ణవి చైతన్య.. సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా మారిన వైష్ణవి.. బేబీ సినిమాతో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

నటిగా ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అయిన వైష్ణవి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈరోజు (జనవరి 4న) వైష్ణవి చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. వైష్ణవి చైతన్య పక్కా హైదరాబాదీ అమ్మాయి.

స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే కుటుంబ బాధ్యతలు తీసుకుంది. పెళ్లిళ్లు, డ్యాన్స్ ఈవెంట్లలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా వర్క్ చేసింది. హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కంది. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా షార్ట్ ఫిల్మ్స్ చేసి యూట్యూబ్ లో పాపులర్ అయ్యింది.

బేబీ సినిమాతో నటిగా మారింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అనుష్క అంటే చాలా ఇష్టమని.. ఆమె ఏం చేసినా ఎలా ఉన్నా నచ్చుతుందని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే అనుష్క తనకు ఫీమేల్ క్రష్ అని చెప్పుకొచ్చింది.

అలాగే ఇండస్ట్రీలో తాను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. దేవదాసు సినిమా చూసినప్పటి అతడి నటనకు ఫిదా అయ్యానని అన్నారు. పార్టీలు, ఫంక్షన్స్ కంటే ఒంటరిగా గడపడమంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది.