ఇందుక్కాదమ్మా నిన్ను తిట్టేది.. లేకపోతే మరేంటి నోటికి ఎంతొస్తే అంత మాట అంటావా..? అబద్ధాలు చెప్తున్నావనే ధ్యాస కూడా ఉండట్లేదా..? ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు ఏంటా మాటలు..? అసలెవరి గురించి ఈ ఉపోద్ఘాతమంతా అనుకుంటున్నారు కదా..? మేమెందుకు చెప్పండి..? ఎవరి గురించో మీరే చూసేయండి..
చూసాక మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. కొందరు హీరోయిన్లకు గ్లామర్‌తో పాటు కాంట్రవర్సీలు బోనస్. అలాంటి వాళ్లలో తాప్సీ ఎప్పుడూ ముందే ఉంటారు. నేనున్నా అంటూ వివాదాల్లో నిలుస్తుంటారు.
అప్పట్లో తెలుగు ఇండస్ట్రీపైనే కాకుండా.. రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకుడిపై నోరు పారేసుకుని విమర్శల పాలయ్యారు తాప్సీ. ఆ తర్వాత సారీ చెప్పినా ఫలితం లేకపోయింది. తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు.
బాలీవుడ్‌లో క్యాంపులుంటాయి.. ఫేవరెటిజం ఉంటుంది.. ఫ్రెండ్ షిప్ బట్టి అక్కడ ఛాన్సులు వస్తుంటాయి.. వాళ్లెవర్ని చెప్తే వాళ్లనే తీసుకుంటారు.. ఇవన్నీ తెలిసే ఇండస్ట్రీకి వచ్చానంటూ ఈ మధ్యే తాప్సీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
వీటి వేడి చల్లారక ముందే.. మరోసారి రెచ్చిపోయారు తాప్సీ. తనకు కమర్షియల్ హీరోలతో నటించే ఛాన్సులు రాలేదంటూ చెప్పుకొచ్చారు. ట్విట్టర్‌లో ఫ్యాన్స్ అడిగిన వాటికి సమాధానమిస్తూ.. తనకు కమర్షియల్ హీరోలతో నటించే ఛాన్సులు రాలేదన్నారు తాప్సీ.
ఇది విన్న ప్రభాస్, రవితేజ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్, వీర, దరువులో వాళ్లతో నటించావ్ కదా.. వాళ్లు కమర్షియల్ హీరోలు కాదా..? డంకీలో షారుక్‌తో నటిస్తున్నావ్ కదా.. 1000 కోట్ల హీరో కూడా నీకు కమర్షియల్‌గా కనిపించట్లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి తాప్సీ ఏం చెప్తారో..?