
టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని ఇంటి కోడలు శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామన్ రాఘవన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. హిందీతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది.

తెలుగులో మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అలాగే పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తమిళంలోనూ మెప్పించింది. గతేడాది మంకీ మ్యాన్ సినిమాతో అలరించింది. విభిన్న కంటెంట్ చిత్రాలతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శోభితా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న శోభితా... నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఇటీవలే సెట్ లో వంటలు చేస్తున్న ఫోటోస్ షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక చీరకట్టులో అందమైన ఫోటోస్ పంచుకుంది.

సముద్ర తీరంలో నీలిరంగు చీరకట్టులో సింపుల్ గా కనిపిస్తుంది. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది శోభిత. ఆ తర్వాత మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది.