
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు స్నేహ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలకు జోడిగా మెరిసింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే స్నేహ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సంప్రదాయ లంగావోణిలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది స్నేహ.

ప్రస్తుతం ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇస్తున్న స్నేహ.. అటు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో సహయ నటిగానూ నటిస్తుంది.

తొలివలపు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. గ్లామరస్ పాత్రలు కాకుండా సంప్రదాయ లుక్లో కనిపిస్తూనే హీరోయిన్ సౌందర్యను గుర్తుచేసింది.

చీరకట్టులో, ట్రెడిషనల్ లుక్ మెయింటైన్ చేస్తూ టాప్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది. ఇప్పుడు కోలీవుడ్ లో ఓ రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది బుల్లితెరపై సందడి చేస్తుంది.