
అందంతో పాటు ట్యాలెంట్ ఉన్న నటీమణుల్లో శృతీ హాసన్ ఒకరు. తండ్రి కమల్ వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ.

తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతి సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తుంటుంది.

ముఖ్యంగా ప్రేమ వ్యవహారానికి సంబంధించి శృతీ ఇటీవల పలుసార్లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతీ తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాలేజీ రోజుల్లో రాక్‌స్టార్ కావాలని కలలుకన్న తాను.. సొంతంగా రాక్‌బ్యాండ్‌ను ఏర్పాటు చేయాలనుకుందట.

అందుకోసమే కొన్ని డబ్బులు సంపాదించేందుకు రెండు, మూడు సినిమాలు తీసి ఆ తర్వాత చిత్రసీమకు గుడ్‌బై చెబుదామనుకున్నానని చెప్పుకొచ్చింది.

కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత క్రమంగా సినిమాల్ని ప్రేమించడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చిన శృతీ.. ఇప్పుడు ఇండస్ట్రీయే తన ప్రపంచం అయిపోయిందని చెప్పుకొచ్చింది.