Shriya Saran: ఏం నవ్వురా బాబు..! కుర్రకారును ఫిదా చేస్తున్న శ్రియ..
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన భామల్లో శ్రియ శరన్ ఒకరు. తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. శ్రియా సరన్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ.
Updated on: Mar 12, 2024 | 8:53 PM

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన భామల్లో శ్రియ శరన్ ఒకరు. తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. శ్రియా సరన్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన శ్రియ. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతోనూ నటించింది.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు సినిమాలతో పాటు సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుంది శ్రియ. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది శ్రియ.

ఇక శ్రియ మూడు పదుల వయసులోనూ మతిపోగోట్టే అందాలతో కవ్విస్తుంది శ్రియ. సోషల్ మీడియాలో శ్రియ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అభిమానులను అలరించేలా ఫోటోలు షేర్ చేస్తుంది శ్రియ.

తాజాగా చీరకట్టులో కెవ్వు కేక పెట్టించింది శ్రియ. శ్రియ ఫోజులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.ఈ వయసులోనూ ఏమాత్రం వన్నె తగ్గకుండా ఆకట్టుకుంటుంది శ్రియ.