
సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ శివానీ రాజశేఖర్. ఇప్పుడిప్పుడే సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కిస్తున్న జీడీ నాయుడు బయోపిక్ లో ఆర్ మాధవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ తో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాన్ని తెరపైకి తీసుకువచ్చిన మాధవన్ ఇప్పుడు మరో బయెపిక్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ది ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన జీడీ నాయుడు బయోపిక్ రూపొందిస్తున్నారు.

ఇందులో ఆర్. మాధవన్ తోపాటు శివానీ రాజశేఖర్ సైతం కనిపించనున్నారు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. శివానీ రాజశేఖర్ ఇప్పటివరకు తెలుగులో విభిన్నమైన చిత్రాల్లో కనిపించింది.

అలాగే పలు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలోనూ సత్తా చాటింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడయాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా జీడీ నాయుడు మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది.