
సినీరంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. బాజీగర్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మై ఖిలాడీ తూ అనాడీ సినిమాతో హిట్ అందుకుంది. దీంతో వీరిద్దరి జోడికి అప్పట్లో మంచి క్రేజ్ వచ్చింది.

హిందీలో వరుస అవకాశాలు అందుకుని స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. అలాగే ఏదోక వివాదంలో చిక్కుకుంటూ నిత్యం వార్తలలో నిలుస్తుంది.

గతంలో తన పర్సనల్ లైఫ్ గురించి శిల్పా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. మై ఖిలాడీ తూ అనాడీ సినిమా సమయంలోనే తనకు అక్షయ్ కుమార్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పా... తాను ఓ హీరోను ప్రాణంగా ప్రేమించానని... కానీ అతడు తనను మోసం చేసి మరో అమ్మాయితో ఎఫైర్ కొనసాగించాడని తెలిపింది. అప్పటి నుంచి ఆ హీరోతో కలిసి నటించడం మానేశానని తెలిపింది.

ఆ హీరోను తనను ప్రేమిస్తున్నానని చెబుతూనే మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని.. ఆ అమ్మాయి అతడి జీవితంలోకి రాగానే తనను వదిలేశాడని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.