తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమా చేసి ఊహించని రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. కానీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినీ పరిశ్రమకు దూరమైపోతారు. వారిలో షాలిని పాండే ఒకరు.
ఈ అమ్మడు అందం, అభినయంతో మెప్పించినా.. అవకాశాలు మాత్రం అందనంత దూరంలోనే ఉంటున్నాయి. అసలు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండే స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. అంతే కాదు చేసిన కొన్ని సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో చాలా కాలంగా ఈ అమ్మడు ఖాళీగానే ఉంటుంది.
సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది షాలిని పాండే. నెట్టింట యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పంచుకుంటుంది. ఇదిలా ఉంటే ఎట్టకేలకు ఈ అమ్మడికి ఓ సినిమా ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.
తాజాగా షాలిని పాండే కోలీవుడ్ హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయబోతోందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ మూవీ ఇడ్లీ కడైలో షాలిని పాండే హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందని టాక్. మరి ఈ సినిమా అయినా అమ్మడి అదృష్టాన్ని మారుస్తుందేమో చూడలి.