- Telugu News Photo Gallery Cinema photos Actress Sara Ali Khan walks as princes of pataudi at cannes 2023 photos goes viral telugu cinema news
Sara Ali Khan: కేన్స్‌లో మెరిసిన పటౌడీ క్వీన్.. యువరాణిలా ముస్తాబైన సారా అలీ ఖాన్..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై బాలీవుడ్ భామ సారా అలీఖాన్ మెరిసిపోయింది. తొలి సారి ఆమె ఆ ఫెస్టివల్‌లో క్యాట్‌వాక్ చేసింది. ఐవరీ కలర్ లెహంగాలో సారా స్టన్నింగ్‌గా కనిపించింది. అబూ జానీ-సందీప్ కోశ్లా ఆమె గౌన్‌ను డిజైన్ చేశారు. కురులకు తన దుపట్టాలను పిన్ చేసిందామె. మేకప్ తక్కువే వేసుకున్న సారా.. తన ఔట్‌ఫిట్‌తో మైమరపించింది.
Updated on: May 18, 2023 | 5:38 PM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై బాలీవుడ్ భామ సారా అలీఖాన్ మెరిసిపోయింది. తొలి సారి ఆమె ఆ ఫెస్టివల్‌లో క్యాట్‌వాక్ చేసింది.

ఐవరీ కలర్ లెహంగాలో సారా స్టన్నింగ్‌గా కనిపించింది. అబూ జానీ-సందీప్ కోశ్లా ఆమె గౌన్‌ను డిజైన్ చేశారు. కురులకు తన దుపట్టాలను పిన్ చేసిందామె. మేకప్ తక్కువే వేసుకున్న సారా.. తన ఔట్‌ఫిట్‌తో మైమరపించింది.

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు జరగనున్నది. జీన్ డూ బ్యారీ చిత్ర ప్రీమియర్ సందర్భంగా సారా అలీఖాన్ రెడ్‌కార్పెట్‌లో పాల్గొన్నది.

ప్రస్తుతం సారా అలీఖాన్ పలు చిత్రాల్లో నటిస్తోంది. జరా హట్కే జరా బచ్కే, ఏ వతన్ మేరే వతన్ చిత్రాల్లో సారా యాక్ట్ చేస్తోంది.

సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కూతురైన సారా.. 2018లో బాలీవుడ్ చిత్రం చేసింది. కేదార్‌నాథ్ చిత్రంలో ఆమె సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో నటించింది.





























