తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు సదా. జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రానికే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించిన సదా.. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు కోల్పోయింది.
సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో 1984 ఫిబ్రవరి 17న జన్మించింది. సదా 2002లో తెలుగులో జయం సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.
ఇదే చిత్రం ద్వారా తమిళంలో జయం రవి సరసన సదా నటించింది. సదా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు.
సదా సినిమాతో పాటు హోటల్ వ్యాపారం కూడా చేస్తుంది.టీవీ షోలలో సైతం సందడి చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి సదా.. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
తాజాగా చీరకట్టులో వెండి వెన్నెలమ్మగా ముస్తాబయ్యింది సదా.
తాజాగా చీరకట్టులో వెండి వెన్నెలమ్మగా ముస్తాబయ్యింది సదా.