రెజీనా కసాండ్రా.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. తక్కువ సమయంలోనె టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శివ మనసులో శ్రుతి సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటించి అలరించింది. కానీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సందడి చేసిన రెజీనా ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది.

ఇటీవల ఉత్సవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రెజీనా కెరీర్ ప్రారంభంలోనే స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ సినిమాను చేసుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ క్రేజ్ మరోలా ఉండేది.

శివ మనసులో శ్రుతి సినిమాతోపాటు శేఖర్ కమ్ముల తెరకెక్కించే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో సెలక్ట్ అయ్యిందట. కానీ రెండు సినిమాలు ఒకేసారి డేట్స్ ఇవ్వడం కుదరకపోవడంతో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా నుంచి తప్పుకుందట.